పాపం RCB.. బయటకు నెట్టేయగానే సెంచరీ బాదిన భారత ఆల్‌రౌండర్

పాపం RCB.. బయటకు నెట్టేయగానే సెంచరీ బాదిన భారత ఆల్‌రౌండర్

విజయ్ హజారే ట్రోఫీ 2023లో భాగంగా హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ ఆటగాడు, భారత ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ సెంచరీ(100; 118 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్ లు)తో మెరిశాడు. 130 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన బెంగాల్ జట్టును షాబాజ్ ఆదుకోవడమే కాకుండా తన సెంచరీతో గౌరప్రదమైన స్కోర్ అందించాడు. దీంతో బెంగాల్ నిర్ణీత 50 ఓవర్లలో 225 పరుగులు చేయగలిగింది.

ఆర్‌సీబీపై విమర్శలు

షాబాజ్ అహ్మద్ సెంచరీ చేయటం మంచిదే అయిన అది ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)ని విమర్శల్లోకి నెడుతోంది. ఐపీఎల్ తదుపరి(2024) సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ యాజమాన్యం అతన్ని అంటిపెట్టుకోకుండా జట్టు నుంచి తప్పించడమే అందుకు కారణం. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు షాబాజ్ అహ్మద్‌ను ట్రేడ్ రూపంలో ఆర్సీబీ నుండి చేజిక్కించుకుంది. అందుకు బదులుగా మయాంక్ దాగర్‌ను వదిలేసుకుంది.

అదే మన సంస్కారం

నిజానికి షాబాజ్ అహ్మద్ రిటైన్ చేసుకోదగ్గ ప్లేయరే. కానీ ఆర్సీబీ యాజమాన్యం అతన్ని మయాంక్ దాగర్ కోసం వదిలేసుకుంది. దీంతో ఆ జట్టు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాణించే ఆటగాళ్లను వదిలేసుకోవటమే మన ప్రాంచైజీ సంస్కారం అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.  

ఐపీఎల్ టోర్నీలో ఇప్పటివరకూ 39 మ్యాచ్‌లు ఆడిన షాబాజ్ అహ్మద్ 321 పరుగులు చేశాడు. అలాగే 9.15 ఎకానమీతో 14 వికెట్లు తీశాడు. ఇటీవల చైనా, హాంగ్‌జౌ వేదికగా జరిగిన ఆసియా క్రీడలు 2023ల్లో  స్వర్ణ పతకం సాధించిన భారత జట్టులో షాబాజ్ సభ్యుడు.